ఆరోగ్య‌శ్రీ‌ని అనారోగ్య‌శ్రీగా మార్చుతున్నారు

- ఆరోగ్య‌శ్రీ‌ని నిర్వీర్యం చేసే దిశ‌గా తెలంగాణ స‌ర్కార్
- ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చ‌ెలగాటం ఆడుతున్నకేసీఆర్ 
- సీఎం ఇచ్చిన హామీలకే దిక్కులేదు
- 119నియోజ‌క‌వ‌ర్గాల‌కు అన్ని జిల్లాలా..?
- టీ వైయ‌స్సార్సీపీ అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రెడ్డి

హైదరాబాద్‌: ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసే దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వ తీరు కొన‌సాగుతుంద‌ని తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి కొండ రాఘ‌వ‌రెడ్డి అన్నారు. వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మ‌ట్లాడారు. ఆరోగ్య‌శ్రీ ఉన్న ఆస్ప‌త్రుల‌కు అర‌కొర నిధులు కేటాయిస్తూ ప్ర‌జ‌ల ఆరోగ్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ చ‌ెలగాటం ఆడుతున్నార‌ని మండిపడ్డారు. త‌మ డిమాండ్ల‌ కోసం స‌మ్మెలు చేసిన ఆస్ప‌త్రుల‌కు నిధులు కేటాయించ‌కుండా, కేసీఆర్ అడుగుల‌కు మ‌డుగులొత్తే ఆస్ప‌త్రుల‌కు నిధులు కేటాయిస్తున్నార‌ని రాఘ‌వ‌రెడ్డి ధ్వ‌జమెత్తారు. 

సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో 24 జిల్లా కేంద్రాల్లో 24సూప‌ర్ స్పెష‌లిటీ ఆస్ప‌త్రుల‌తో పాటు నలుగురు డాక్ట‌ర్ల‌తో మండ‌ల స్థాయిలో 30ప‌డ‌క‌ల ఆస్ప‌త్రులు, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వంద ప‌డ‌క‌ల ఏరియా ఆస్ప‌త్రుల‌ను నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, సీఎం ఇచ్చిన హామీకి ఇప్ప‌టికీ నెర‌వేర‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. తెలంగాణ‌లోని ఆస్ప‌త్రుల‌కు ఇప్పటికే 500 కోట్లు బ‌కాయిలు ఉండగా...2016 ఏఫ్రిల్ నెల‌లో రూ. 41కోట్లు చెల్లించాల్సి ఉండ‌గా కేవ‌లం రూ. 21కోట్లు, మే నెల‌లో రూ. 46 కోట్ల‌కు బ‌దులు రూ. 11, జూన్‌లో రూ. 46 కోట్ల‌కు రూ. 3కోట్ల 20ల‌క్ష‌లు, జూలై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌లో అస‌లు నిధులే కేటాయించ‌లేద‌ని, మొత్తం రూ. 246కోట్ల‌కు రూ. 36 కోట్ల కేటాయించ‌డం దారుణ‌మ‌న్నారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కొన‌సాగితే వైయ‌స్సార్ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌న్న భ‌యంతోనే కేసీఆర్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అబ‌ద్దాల పునాదుల‌పై కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యార‌ని ఆరోపించారు. అబ‌ద్దాల‌పై ప్ర‌భుత్వాన్ని న‌డిపించాల‌న్న ఆలోచ‌నతో ప్ర‌భుత్వ తీరు ఉంద‌న్నారు. 

119 నియోజక‌వ‌ర్గాల‌కు 119 జిల్లాలు ప్రకటిస్తే సరి..?
ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ‌ను 24జిల్లాల‌ను చేస్తాన‌న్న కేసీఆర్ ప్ర‌స్తుతం జిల్లా కోసం ఎవ‌రు రాజీనామా చేస్తే దానిని జిల్లా ప్ర‌క‌టిస్తున్నారని రాఘ‌వ‌రెడ్డి మండిప‌డ్డారు. జిల్లాల విభ‌జ‌న అశాస్త్రీయంగా జ‌రుగుతుంద‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో 24 జిల్లాలు ప్ర‌తి జిల్లాకు ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స్థానాలు మాత్ర‌మేన‌ని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఇష్టారాజ్యంగా జిల్లాలు ప్ర‌క‌టించే బ‌దులు 119 నియోజ‌క‌వ‌ర్గాల‌ను 119 జిల్లాలుగా ప్ర‌క‌టించి, ఎంఆర్ఓల‌ను క‌లెక్ట‌ర్లుగా మార్చ‌డం మేల‌న్నారు. వ‌ర్షాల దాటికి హైద‌రాబాద్ న‌గ‌రంలో రోడ్ల‌న్నీ మురికి కూపాలుగా మారిపోయాయ‌ని, వాటిని బాగు చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టికైనా కేసీఆర్ అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌కు విలువ‌లు ఇవ్వాల‌న్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆందోళ‌న‌లు చేస్తే వారిపై కేసులు పెడుతూ, ఎదురు దాడులు చేస్తున్నార‌న్నారు. రంగారెడ్డి జిల్లా ఏర్పాటై 32 యేళ్లు గ‌డుస్తున్నా నేటికీ జిల్లా కేంద్రం లేద‌న్నారు. ఇప్ప‌టికి తెలంగాణ‌లోని అనేక ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగుతున్నాయ‌న్నారు. 

మ‌హానేత మాన‌స పుత్రిక ఆరోగ్య శ్రీ‌
దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాన‌స పుత్రిక ఆరోగ్య శ్రీ ప‌థ‌కం అని రాఘ‌వ‌రెడ్డి స్పష్టం చేశారు. 1-4-2007లో మూడు జిల్లాలో 163 వ్యాధుల‌కు చికిత్స‌లు అందించే విధంగా ఆరోగ్య‌శ్రీ‌ని ప్రారంభించార‌న్నారు.  5-12-2007లో ఆరోగ్య‌శ్రీ‌ని ఎనిమిది జిల్లాల్లో 210వ్యాధుల‌కు, 5-4-208లో 13 జిల్లాల్లో, 17-7-2008లో  23జిల్లాల‌కు పూర్తిస్థాయిలో విస్త‌రించి, 865 వ్యాధుల‌కు చికిత్స‌లు అందించేట‌ట్లు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేశార‌ని ఆయ‌న వివ‌రించారు. దీంతో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రంగా మారింద‌న్నారు. వైయ‌స్సార్ హయాంలో 2007కు ముందు రూ. ల‌క్ష 5వేల మందికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ను అంద‌జేశార‌న్నారు. ప్ర‌తి పేద‌వాడికి సీఎం రిలీఫ్ ఫండ్ అంద‌డం లేద‌న్న ఆలోచ‌న‌తో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని ప్రారంభించి ప్ర‌తి పేద‌వాడికి కార్పొరేట్ వైద్యం అందించార‌ని ఆయ‌న పేర్కొన్నారు.
Back to Top