ఈ నెల 14న రాజ్యాంగ పరిరక్షణ దినం


భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని దగా చేసిన కేంద్రానికి వ్యతిరేకంగా ఈ నెల 14న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రాజ్యంగ పరిరక్షణ దినంగా పిలుస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మా పార్టీకి చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో టీడీపీలో చేర్చుకోవడం, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు. 14న అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతులు ఇస్తూ నిరసనలు తెలుపుతున్నట్లు భూమన చెప్పారు.ప్రజాస్వామ్యానికి బీజేపీ తప్పుడు భాష్యం చెబుతోందని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top