బాధితులకు న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ నేత ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం: తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుపాన్‌ బాధితులు ఆహారం, పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సాయిరాజ్‌ ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకొని బాధితులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే కార్యకర్తలు, పోలీసులు సాయిరాజ్‌ను అడ్డుకున్నారు. 
 
Back to Top