అభివృద్ధి చేయాల్సిన ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతి చేస్తారా?

నెల్లూరు: విభజనతో అన్యాయానికి గురైన అంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సిన చంద్రబాబు.. తన నాయకుల చేత విచ్చలవిడిగా దోపిడీని ప్రోత్సహిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు కాంట్రాక్ట్‌లుగా మారి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నెల్లూరు రూరల్‌ మాగంటి లేఅవుట్‌లో వేసిన రోడ్డు రోడ్డు రెండు వారాలకే కుంగిపోయిందని, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు, కుంగిపోయిన రోడ్డుకు బిల్లులు ఆపేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. 

తాజా ఫోటోలు

Back to Top