ఏపీలో ఏసీబీ ని మూసేస్తారా..!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని పోలీసు ఉన్నతాధికారులు
అంతర్మథనంలో పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర పోలీసు విభాగానికి మచ్చ
ను తెచ్చిపెడుతున్నాయి. చంద్రబాబు వ్యక్తిగతంగా చేసిన తప్పుల్ని పోలీసు ఉన్నతాధికారులు
భుజాల మీద మోయాల్ని రావటాన్ని పోలీసు పెద్దలు తప్పు పడుతున్నారు.

 ఓటుకి కోట్లు కుంభకోణం

 ఓటుకి కోట్లు కుంభకోణం విషయం బయటకు పొక్కగానే
చంద్రబాబు నాయుడు చేసిన పని పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించి మంతనాలు ఆడటం. ఆరోజు
నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు, సమీక్షలు జరిగిపోతున్నాయి.
ఈ కుంభకోణం నుంచి చంద్రబాబును బయటకు లాగటం ఎలా అన్న దాని మీద చర్చోపచర్చలు సాగాయి..
సాగుతూనే ఉన్నాయి. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీప్, ఏసీబీ అధిపతి, ఇతర సీనియర్‌ఉన్నతాధికారులు
సీఎం చుట్టూ తిరుగుతున్నారు.

 ఏసీబీ సంగతి ఏమిటి..!

 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిరోధక విభాగం పరిస్థితి
ఏమిటనే మాట బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలోని చిన్న ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి
వరకు ఎవరైనా అవినీతి కి పాల్పడితే పట్టుకోవాల్సిన బాధ్యత ఏసీబీదే. అందుకే ఏసీబీ కేసు
కడితే ఉద్యోగులు కంగారు పడతారు. అంతే కాదు, ఆయా ప్రభుత్వ శాఖలు లేదా విభాగాల్లో ఏసీబీ
కేసు నమోదు అయితే వెంటనే ఆయా ఉద్యోగిని విధుల్లోంచి తొలగిస్తారు. ఆ తర్వాత కేసు తేలే
దాకా విధులకు దూరంగా ఉంచుతారు.

      ఇప్పుడు
ఈ ఏసీబీ పనితీరు ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు తెలంగాణ ఏసీబీ పెట్టిన
కేసులో నిందితుడుకి పోలీసు శాఖ రక్షణ కవచంలా నిలుస్తోందన్న మాట వినిపిస్తోంది. స్వయంగా
పోలీసులే రక్షణ కల్పిస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. అటువంటప్పుడు చిరుద్యోగుల్ని
అరెస్టు చేసి కటకటాల వెనక్కి నె ట్టడం ఎంత వరకు నైతికంగా కరెక్టు అన్న మాట వినిపిస్తోంది.
పైగా తెలంగాణ ఏసీబీ నోటీసులు అందుకొన్న సండ్ర వెంకట వీరయ్య కు కొందరు పోలీసు అధికారులు
కోచింగు ఇస్తున్నార న్న మాట ఉంది. అటువంటప్పుడు మరో అవినీతి అంశం బయట పడితే ఏసీబీ అధికారులు
ఇతరుల్ని నోటీసు ఇచ్చి పిలిపిస్తారా లేదా అన్న మాట ఉంది. లేదంటే ఆయా వ్యక్తులు కూడా
బయట కోచింగ్ కోసం ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నలు లేవ నెత్తుతున్నారు.

      అన్నింటికి
మించి కోట్ల రూపాయల కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు నాయుడుకు... ఈ వివాదం
నుంచి బయట పడే మార్గాల కోసం సీనియర్ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని అవినీతి బాగోతాల్ని ఏ
రకంగా వెలికి తీయగలుగుతారన్న మాట వినిపిస్తోంది. అటువంటి కేసుల్లోని సూత్రధారులు కూడా
ఇదే విధంగా ట్యూషన్ లు కోరుకొంటే పరిస్థితి ఏమిటి..!

      మొత్తం
మీద కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కార్యకలాపాలు ముందుకు వెళతాయా లేక మందగించిపోతున్నాయా
అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అటువంటప్పుడు ఏసీబీ వ్యవస్థ ఎంత వరకు నైతికంగా దర్యాప్తు
సాగిస్తుంది. అంతకు మించి ఏసీబీ ఉన్నతాధికారుల మీద ఉంటే నైతికపరమైన ఒత్తిడి అంతా ఇంతా
కాదు. ఇన్ని తలనొప్పులకు మూలం చంద్రబాబు కాదా..! ఆయన వ్యక్తిగత కక్ష కోసం మొత్తం వ్యవస్థ
ను బలిపెట్టడం కాదా..!

 

 

 

Back to Top