అన్ని వర్గాలకూ జగన్‌ మేలు చేస్తారు: కృష్ణబాబు

- విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరతా

కొవ్వూరు (పశ్చిమగోదావరి జిల్లా), 9 అక్టోబర్‌ 2012: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బాటలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తారనే విశ్వాసం తనకు ఉందని టిడిపి సీనియర్ ‌నాయకుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) తెలిపారు. అందువల్లే తాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు ఆయన‌ తెలిపారు. కృష్ణబాబు సొంత ఊరు దొమ్మేరులో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనతో పాటు పలువురు నాయకులు టిడిపికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సిపిలో చేరనున్నట్లు వెల్లడించారు.

సన్నిహితులతో చర్చించి త్వరలోనే పార్టీలో చేరే తేదీని, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని ప్రకటిస్తానని కృష్ణబాబు తెలిపారు.‌ ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో త్వరలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో తాను, తన అనుచరులు, స్థానిక నాయకులు వైయస్‌ఆర్‌ సిపిలో చేరతామని చెప్పారు.

వైయస్‌ఆర్‌ సిపి సీఈసీ సభ్యుడు కొయ్యే మోషేన్‌రాజు, పార్టీ నాయకులు కొవ్వూరు నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి కృష్ణబాబును కలిశారు. పార్టీలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
Back to Top