ఆంధ్రా నయీంల దందాలు

విజయవాడ: క్విట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం పేరుతో చంద్రబాబు నాయుడును  ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని వైయస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనే విద్యార్థులను జైల్లో పెడతాననడం అమానుషమని అన్నారు. టీడీపీ శాసనసభ్యులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సామినేని ఉదయభాను విమర్శించారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కోడెల శివప్రసాదరావు తనయుడు ఆంధ్రా నయీంలుగా దందాలు సాగిస్తున్నారని ఉదయభాను మండిపడ్డారు. ప్రత్యేకహోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 

తాజా ఫోటోలు

Back to Top