బాబు నిర్వాకం వల్లే అన్నదాతల ఆత్మహత్యలు

అనంతలో రెండు వేల బైక్‌లతో సంఘీభావ ర్యాలీ
అనంతపురం: తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం వల్లే వేలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయంపై చంద్రబాబు ప్రసంగాలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతలో రెండు వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, నేతలు రాగే పరశురాం, మహాలక్ష్మీ, శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవసాయ పాఠాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 
రాప్తాడు నియోజకవర్గంలో..
వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా బి.యాలేరు నుంచి కక్కలపల్లి వరకు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు.  
 

తాజా ఫోటోలు

Back to Top