<br/>అనంతపురం) వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో పార్టీ సీనియర నాయకులు మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రజలతో మమేకమై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అనతికాలంలోనే బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. పేదల మొహాల్లో నవ్వులు చూడడమే ధ్యేయంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగిందన్నారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ పేదల పక్షాన పోరాటాలు సాగిస్తోందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ యువకులు, కార్మికులు, రైతులు, మహిళల సంక్షేమం కోసం పార్టీ పోరాటాలు చేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.