పోలీసుల నిర్బంధంలోనే కాపు రామచంద్రారెడ్డి


అనంతపురం: చంద్రబాబు హామీలపై సవాలు విసిరిన వైయస్‌ఆర్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. చంద్రబాబు అవినీతి, టీడీపీ అక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని వైయస్‌ఆర్‌సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి సవాలు చేయడంతో ఇందుకు మంత్రి కాలువ శ్రీనివాసులు సిద్ధపడగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. రామచంద్రారెడ్డిని పోలీసులు నిర్బంధంలో ఉంచి చర్చకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. బంధువుల ఇంటికి ఆయనను తరలించారు. కాలువ శ్రీనివాసులు రాయదుర్గానికి ఏమీ చేయలేదని, అవినీతి మాత్రం విచ్చలవిడిగా చేశారన్నారు. కళ్లిబొల్లిమాటలు చెప్పి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన మాపై నిందలు వేస్తున్నారన్నారు. రాయదుర్గాన్ని డబ్బు సంపాదించుకునేందుకు సాధనంగా ఉపయోగించుకున్నారని విమర్శించారు.
 
Back to Top