వైయస్‌ఆర్‌సీపీలోకి ఆనం రామనారాయణ రెడ్డి

 విశాఖపట్టణం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , మాజీ మంత్రి ఆనం
రామనారాయణ రెడ్డి ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్పయాత్ర
చేస్తున్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వేచలం వద్ద ఆనం రామనారాయణ రెడ్డి కలుసుకున్నారు. కండువా కప్పి ఆయనను, అనుచరులతో సహా వైయస్
జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈసందర్భంగా  ఆనం మాట్లాడుతూ టీడీపీ,బీజేపీ రాష్ట్ర
ప్రజలను మోసం చేశాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజలకు అండగా నిలవాలనే మంచి
ఆశయంతో జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ లేని లోటు ఎవరూ
తీర్చలేదన్నారు.

తాజా ఫోటోలు

Back to Top