అమృతలూరులో నేడు షర్మిల బహిరంగ సభ

గుంటూరు, 19 మార్చి 2013: మహానేత డాక్టర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి తనయ, జననేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల నేడు అమృతలూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా మరో ప్రజాప్రస్థానం పేరిట శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర 95వ రోజు మంగళవారం నాడు వేమూరు నియోజకవర్గంలో సాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

సోమవారం రాత్రికి బసచేసిన ప్రాంతం మోదుకూరు శివారు నుంచి మంగళవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వైయస్ అభిమానులు, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యకర్తలు ‌అధిక సంఖ్యలో తరలివచ్చారు. మోపర్రు మీదుగా భోజన విరామ కేంద్రానికి ఆమె చేరుకుంటారు. భోజన విరామం తరువాత ఆమె తురుమెళ్ల మీదుగా అమృతలూరు చేరుకుంటారు. అమృతలూరులో ఏర్పాటు చేసిన సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం పెదపూడి వరకూ పాదయాత్ర చేసి అక్కడి నుంచి గ్రామ శివారులోని రాత్రి బసకు చేరుకుంటారు.
Back to Top