అందరికీ మంచిరోజులొస్తాయి: ఎంపీ

నెల్లూరు:

ప్రజలకు మంచి రోజులు రానున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన క్రీడాసంబరాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థి, యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగాలనీ, బడుగుల కలలు నెరవేరాలనీ ఆకాంక్షించారు. తొలుత క్రైస్తవ సోదరులకు మేకపాటి క్రిస్మస్, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జైల్లో ఉన్న జగనన్నకు మంచి జరగాలనీ, పవిత్ర క్రిస్మస్ పండగరోజు అందరు సుఖసంతోషాలతో జీవించాలనీ కోరుతూ ఆలపించే ‘జింగిల్ బెల్సు’ గీతాన్ని ఆలపించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి కోరారు. ఆయన ఇచ్చిన పిలుపుతో క్రీడాసంబరాల్లో పాల్గొన్న విద్యార్థి,యువత,మహిళలు, క్రీడాకారులు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి బాగోగులను కాంక్షిస్తూ జింగిల్ బెల్సు గీతాన్ని ఆలపించారు. జగన్మోహన్‌ రెడ్డిని కుట్రలతో కారాగారంలో పెట్టించి ఆనందిస్తున్న వారికి రానున్న రోజుల్లో నిజాలు తెలిసి పశ్చాత్తాపం పడకతప్పదని న్యాయవాది, పార్టీ నాయకుడు అయిన మధుసూదన్‌రెడ్డి చెప్పారు. తొలుత క్రిస్మస్ క్రీడాసంబరాల్లో భాగంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేక్ కట్‌చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

Back to Top