మీ పార్టీని కూడా మూసేస్తారా..అంబటి రాంబాబు

సవాల్ విసిరితే అది తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తుందన్న విషయం గుర్తించుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసి గెలిస్తే పార్టీని మూసేస్తారా అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమన నాగిరెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. దమ్ముంటే మాట మీద నిలబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పిరాయింపు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరారు. రాజీనామా చేసి గెలిస్తే పార్టీని మూసేసేందుకు సిద్ధమని, అయితే ఓడిపోతే టీడీపీని మూసేస్తారా అని ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ఏమాత్రం చెక్కుచెదరని పార్టీ తమదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Back to Top