'రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యాఖ్యానించారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు తీర్పు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల విజయంగా ఆర్కే అభివర్ణించారు. ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం భూ సమీకరణ అంశంలో పునరాలోచించాలని ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.
Back to Top