ఎమ్మెల్సీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న నాని

విజ‌య‌వాడ‌:  ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల నాని శుక్ర‌వారం ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్నారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీలుగా వైయ‌స్ఆర్‌సీపీ త‌రుఫున ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా, వారిద్ద‌రు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు  అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఆళ్ల నాని శుక్రవారం ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి నాని కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలపై చ‌ట్ట‌స‌భ‌లో పోరాటం చేస్తానని ఆళ్ల నాని తెలిపారు.

Back to Top