హంద్రీనీవా జలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం

చిత్తూరు:

హంద్రీనీవా జలాలు సాధించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మదెనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదెనపల్లికి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ హంద్రీనీవా కాల్వ వద్ద దేశాయి తిప్పారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి హంద్రీనీవా 85 శాతం పూర్తయిందన్నారు. మూడున్నర సంవత్సరాల్లో చంద్రబాబు 15 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయాడని మండిపడ్డారు. రూ.16 వందల కోట్లు కేటాయిస్తే పూర్తవుతుందని, 2 లక్షల ఎకరాలకు సాగు, 5 లక్షల మందికి తాగునీరు అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పటి వరకు హంద్రీనీవా నిర్మాణాన్ని ఏడు సార్లు వాయిదా వేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఇచ్చిన  హామీలను ఆచరణలో పెట్టడం లేదన్నారు. స్వయంగా చంద్రబాబు హంద్రీనీవాను పరిశీలించి సెప్టెంబర్‌ చివరి నాటిని నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికి అక్టోబర్‌ వచ్చినా పనులు చేపట్టలేదన్నారు. అందుకే గాంధీ జయంతిన ఆయన మార్గంలోనే శాంతియుతంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top