ఆదివారం వందరోజుకు షర్మిల పాదయాత్ర

హైదరాబాద్22 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మరో కీలక ఘట్టానికి చేరుకుంటోంది. ఆదివారం ఆమె యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ ఎమ్మెల్యేలందరూ ఈ యాత్రకు హాజరుకానున్నారు. ఆదివారంతో యాత్ర వంద రోజులు పూర్తవుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో అదే రోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తారు.

Back to Top