

















న్యూఢిల్లీ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ప్రయోజనాలు కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై వైయస్ ఆర్ సీపీ ఎంపిలు వరుసగా 9 వ సారి సోమవారం నాడు కూడా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానపు నోటీసును స్పీకర్ కు అందచేశారు. ఈమేరకు ఎంపి వైవి సుబ్బారెడ్డి స్పీకర్ కు నిర్దేశిత నమూనాలో నోటీసును అందచేశారు. నాలుగు రోజులు విరామం తరువాత సోమవారం తిరిగి పార్లమెంటు సమావేశం అవుతోంది.అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఈ మధ్యాహ్నం సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. అవిశ్వాసంపై ఇప్పటికే వివిధ పక్షాలకు చెందిన వంద మంది ఎంపిల మద్ధతు కూడ గట్టామని, స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై హెడ్ కౌంట్ చేపట్టి, తీర్మానంపై ఈ రోజైనా చర్చ చేపట్టాలని ఎంపిలు కోరుతున్నారు.