704 కిలోమీటర్లు నడిచిన షర్మిల

జడ్చర్ల:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల గురువారం 50వ రోజు పాదయాత్రను పూర్తిచేశారు. ఇంతవరకూ ఆమె 704.7 కిలోమీటర్లు నడిచారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల అక్టోబర్ 18న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఆమె 200 గ్రామాలు, పది మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో పాదయాత్ర చేసి ముప్పై లక్షల మందిని కలిశారు. పేదల కష్టాలు విని వారిని ఓదార్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న రాజ్యం వస్తుందనీ, అందరి కష్టాలూ తీరతాయనీ ఆమె భరోసా ఇచ్చారు. గురువారం నాడు శ్రీమతి షర్మిల జడ్చర్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గంగాపూర్, గోప్లాపూ‌ర్ క్రా‌స్, లింగంపేట, కోడగ‌ల్, మట్టపల్లి
‌తండా, నల్లకుంట క్రాస్ మీదుగా కొందేడు చేరుకున్నారు. ఇక్కడే రాత్రి బస చేస్తారు.

Back to Top