విద్యుత్ రంగంలో 5వేల కోట్ల స్కామ్

() విద్యుత్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం

() స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలే బట్టబయలు చేసిన కుంభకోణం

() అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

హైదరాబాద్) విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు 4..5 వేల కోట్ల రూపాయిల మేర కుంభకోణం
జరిగిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వసంస్థలే స్వయంగా బయట పెట్టినా, చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోవటం లేదని పేర్కొన్నారు. అయినా
సరే, దీన్ని అంగీకరించకుండా ప్రభుత్వం బుకాయిస్తోందని ఆయన వివరించారు. అసెంబ్లీలో
విద్యుత్ పద్దుల మీద జరిగిన చర్చలో వైఎస్ జగన్ గణాంకాలతో సహా ఈ విషయాల్ని బట్ట
బయలు చేశారు.

      ప్రస్తుతం విద్యుత్ రౌండ్ ది
క్లాక్ అంటే 24 గంటలకూ 2 రూపాయిల 71పైసలకు, రాత్రి సమయంలో 1రూపాయి 90 పైసలకు
దొరుకుతోంది. అంటే సగటున 2 రూపాయిల 40 పైసలకు దొరికే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 రూపాయిల 11పైసలకు కొనుగోలు చేస్తోందని వైఎస్ జగన్
వివరించారు. దీని మీద స్వయంగా కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ఉండే ఇండియన్ ఎనర్జీ
ఎక్స్చేంజ్ నుంచి వచ్చిన నోట్ లో  ఈ
కొనుగోళ్లను ఆక్షేపిస్తూ కామెంట్ రాశారని వెల్లడించారు. దీన్ని నిస్సిగ్గుగా
సమర్థించుకొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లు జరిగిన మొత్తం
గణాంకాల్ని ఆయన చదివి వినిపించారు. 

Back to Top