అనంతపురం: జిల్లాలో అధికార పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన 400 కుటుంబాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ నుంచి ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు వైయస్ఆర్ సీపీలో చేరారు. వీరికి పార్టీ నాయకులు, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఏపీలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ముస్లిం సంక్షేమానికి పాటుపడింది ఒక్క వైయస్ఆర్ మాత్రమే అన్నారు.ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. రిజర్వేషన్ ఇవ్వడం వల్లే ముస్లింలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రాజన్న అడుగుజాడల్లో ఆయన తనయుడు జగనన్న నడుస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపారన్నారు.
ఒక్క అభివృద్ధి పనీ చేయలేదుపుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వక్ఫ్‌బోర్డు మంత్రిగా ఉన్నా ఒక్క అభివృద్ధి పనీ చేసిందిలేదని పుట్టపర్తి, కదిరి సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి విమర్శించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టనున్న నవరత్నాలతో అట్టడుగు స్థాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు.