పాలకులకు సమస్యలు పట్టడం లేదు: రాజశేఖర్

తుళ్ళూరు: రాష్ట్ర ప్రజలు విద్యుత్ కోతలు, అధిక ధరలతో అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోకుండా, తమ పదవులను కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని అనంతవరం కమ్యూనిటీ భవనంలో ఆదివారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్సార్ పాలన రావాలని కోరుతూ ఎంతోమంది ప్రజలు, అభిమానులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. వైయస్ ఆశయాలు  నెరవేరాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మర్రి పేర్కొన్నారు. మంత్రి డొక్కామాణిక్య వరప్రసాద్ పాదయాత్రల పేరుతో నియోజకవర్గం అంతా తిరుగుతున్నారని అయితే, అనంతవరంలో తాగునీటి సమస్య గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచి ప్రజల నడ్డివిరుస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోందని, ఫీజు రీయింబర్సుమెంట్‌కు తూట్లు పొడిచిందని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గాలికి వదిలివేసిన చంద్రబాబునాయుడు.. నేడు మీ కోసం అంటూ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను మభ్యపెట్టడం కోసం పాదయాత్ర చేపడుతున్నారని విమర్శించారు. సమావేశానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కొమ్మినేని కృష్ణారావు అధ్యక్షత వహించారు. నాయకులు మందపాటి శేషగిరిరావు, కట్టెపోగు నాగమణి, బండి సుజాత, జోజి, కుర్రా వెంకటశివారెడ్డి, నాగేశ్వరరావు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతవరం, నక్కల్లు, దొండపాడు గ్రామాలకు చెందిన 400 మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి పార్డీ కండువా కప్పి నాయకులు ఆహ్వానించారు. తొలుత పెదపరిమిలోని వైయస్ఆర్ ఆలయంలోని వైయస్ విగ్రహానికి మర్రి రాజశేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నెక్కల్లు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనుబంధ విభాగాలను పటిష్టం చేయండి
కడప: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న 19 విభాగాలను పటిష్ట పరచాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక వైయస్ అతిథి గృహంలో అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లతో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు 4లోపు ప్రతి ఒక్కరూ గ్రామ, మండల కమిటీలు పూర్తి చేయాలన్నారు. పార్టీకోసం చురుగ్గా పనిచేసే వారికి కమిటీల్లో స్థానం కల్పించాలని కోరారు. పదవులు పొందిన వారు ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలకు స్పందించేలా ఉండేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న విశ్వాసం ప్రజలకు మరే పార్టీపై లేదన్నారు. ప్రతి జిల్లా కన్వీనర్ 50 మండలాలకు పోవడానికి షెడ్యూల్ రూపొందించుకుని ఆయా మండలాలు, నియోజకవర్గ నేతలతో మాట్లాడి కమిటీలు వేయాలని చెప్పారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే విడుదల కాబోతున్నారని, రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పాలన సరిదిద్దగల ఏకైక నాయకుడు ఆయనే అన్నారు. పార్టీ నగర కన్వీనర్ ఎస్‌బి అంజాద్‌బాష, ట్రేడ్ యూనియ న్ జిల్లా అధ్యక్షుడు జీఎన్‌ఎస్ మూర్తి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పత్త రాజేశ్వరి, ఎస్సీ, సేవాదళ్, సాంస్కృతిక, బీసీ విభాగం, మైనార్టీ విభాగాల జిల్లా కన్వీనర్‌లు పులి సునీల్‌కుమార్, నిత్యానందరెడ్డి, గంథం రాముడు, జానకిరామయ్య, ఎస్‌ఏ కరీముల్లా, నేతలు మాసీమబాబు, రామలక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.
జగన్ వెంటే ప్రజలు
ఎర్రుపాలెం: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైయస్ జగన్ మోహన్‌రెడ్డికి అండగా ఉన్నారని వైయస్‌ఆర్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని ప్రశ్నించినందుకు ఉద్దేశపూర్వకంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌ని జైలు పాలుచేశారని ఆరోపించారు. చివరకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. జగన్‌పై ఆరోపణలు రుజువు చేయలేని సీబీఐ జగన్‌ను బయటకు రాకుండా చేసేందుకు సుప్రీంకోర్టులో న్యాయవాదులను మార్చుతూ ప్రభుత్వంతో కలిసి కుట్ర పన్నుతోందని అన్నారు. వివిధ సమస్యలపై జగన్ చేపట్టిన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. జగన్‌పై ప్రభుత్వ కుట్రలు మానుకోకపోతే రహదారులు దిగ్బంధిస్తామని., ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జగన్‌ విడుదల కోరుతూ రేపు పాదయాత్ర
ఎర్రపాలెం: వైఎస్ జగన్‌ను విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 2వ తేదీన ఎర్రుపాలెం మండలంలోని పెద్దగోపవరం నుంచి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దికెక్కిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని వైయస్‌ఆర్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు తెలిపారు. ఈ సందర్భంగా జమలాపురం ఆలయంలోని స్వామి వారి మెట్లకు మెట్టుకో కొబ్బరికాయను కొడతామని, శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జగన్ పేరిట ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రక్తదాన శిబిరం వాయిదా
మంచిర్యాల: వైయస్ఆర్ కాంగ్రె స్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవా రం జిల్లాలో నిర్వహించతలపెట్టిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆ పార్టీ జిల్లా క న్వీనర్  బోడ జనార్దన్ తెలిపా రు. హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్‌కు అ నుమతి ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మరోపక్క పోలీసులతో అడ్డుకునేందుకు ప్ర యత్నించిందన్నారు. తెలంగాణ సత్తా చా టేందుకు హైదరాబాద్ తరలిన తెలంగాణవాదులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఉ ద్యమాన్ని అణచివేసే దిశగా పోలీసులు వ్య వ్యవవహరించిన తీరుకు నిరసనగా.. జేఏసీ సో మవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిందని.. రక్తదాన శిబిరాన్ని కూడా వాయిదా వేస్తున్నామని ఆయన ప్రకటించా రు. శిబిరం నిర్వహణకు ముందుకొచ్చిన బ్లడ్ బ్యాంకులు, వైద్యులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top