పార్టీలో టీడీపీ నేత చేరిక

మంగళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాళెం పంచాయతీకి చెందిన మునిబాబూయాదవ్ గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 200మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ 29 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ సేవలందించిన తెలుగుయువత జిల్లా కార్యదర్శి మునిబాబూయాదవ్  తమ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. 
వైయస్ఆర్ పథకాలను కొనసాగింస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించగలిగే సత్తా కేవలం జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న జనాదరణ చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ కక్షకట్టి జైలుకు పంపాయన్నారు. బాబూయాదవ్ మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి రాత్రింబవళ్లు కష్టపడి ఉన్న కొద్ది పాటి ఆస్తులను పోగొట్టుకున్నామని వాపోయారు
Back to Top