2014లో జగనే సీఎం: బాలనాగిరెడ్ది

పెద్దకడబూరు:

తన పాలనలో ఏమి చేయలేని చంద్రబాబు నాయుడు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మహానేత కుమార్తె షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం గురువారం పెద్దకడబూరుకు చేరింది. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. తొమ్మిదేళ్లు అభివృద్ధిని మరిచి, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడి పాలనను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. మీ కోసం వస్తున్నా పాదయాత్ర చేస్తున్న బాబుకు కాళ్ల నొప్పులే తప్పా ప్రయోజనముండదన్నారు. 2014లో వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రజలందరూ ఎప్పటికీ వైయస్‌ఆర్‌సీపీ వెంట ఉంటారని చెప్పారు.

Back to Top