గుంటూరు: శేషాచలం ఎన్కౌంటర్పై న్యాయవిచాణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగి, దాదాపు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయినవారు స్మగ్లర్లా? కూలీలా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని అంబటి డిమాండ్ చేశారు.<br/>తమ కూలీలను ఆంధ్ర పోలీసులు చంపేశారని తమిళ నేతలు అంటున్నారని చెప్పారు. న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని అంబటి కోరారు.