189 కి.మీ పూర్తయిన పాదయాత్ర

అనంతపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం యాత్ర 12 కిలోమీటర్ల మేర సాగింది. తుపాను నేపథ్యంలో ఉదయం పూట తుంపర్లతో చిరుజల్లులు కురవగా.. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది. వర్షంలోనే షర్మిల 3 కిలోమీటర్ల వరకు నడిచారు. రాత్రి 7 గంటలకు ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన టెంట్‌లోనే బసచేశారు. బుధవారం నాటికి పాదయాత్ర మొత్తం 188.3 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. కిక్కిరిసిపోయిన జనం మధ్య షర్మిల మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాల తీరును దునుమాడారు. బుధవారం నాటి పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ శాసన సభ్యుడు ప్రసాదరాజు, పార్టీ సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.

Back to Top