కేసీఆర్ రైతుల పొట్టగొడుతున్నారుచంద్రబాబు మాదిరి భూసేకరణ పేరుతో దారుణాలు చేస్తున్నారురాజన్న నినాదం ప్రతి చెయ్యికి పని... ప్రతి చేనుకు నీరుతెలంగాణ వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ః తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 123జీవో కేవలం రైతుల పొట్టగొట్టడానికేనని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి చెయ్యికి పని... ప్రతి చెేనుకు నీరు అన్న నినాదంతో ముందుకెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారని గట్టు శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టుల్లోనే తెలంగాణ అధికార ప్రభుత్వం ఒకసారి బంతిపూలు... మరోసారి చామంతి పూలు... ఇంకొసారి రోజాపూలు పోసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...* 2013 భూసేకరణ చట్టం ప్రకారం సంవత్సరానికి మూడు పంటలు పండే ప్రాంతంలో భూసేకరణ చేయాలంటే ఒక శాతం మాత్రమే తీసుకోవాలి* సాధారణ వ్యవసాయం జరిగే ప్రాంతంలో లక్ష ఎకరాలు భూ సేకరణ చేయాలనుకుంటే అందులో 5వేల ఎకరాలు మాత్రమే చేయాలి. * 2013వ చట్టం పూర్తిస్థాయిలో రైతుల కడుపునింపుతుంది* రైతుల పొట్ట కొట్టడానికే 123జీవో విడుదల చేశారు* టీఆర్ఎస్‌ను చెంపదెబ్బ కొట్టినట్టు 123 జీవోను హైకోర్టు రద్దు చేసింది* రైతు కూలీలు, ఉపాధికి సంబంధించి వారు నిర్వీర్యం అవుతున్నారు * భూములు కొల్పోయిన వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలి* రైతులను పట్టించుకోకపోయినా, రైతుల పట్ల కఠినంగా వ్యవహారించినా వైయస్సార్‌సీపీ కర్షకుల తరపున ఎంతదాకైనా పోరాడుతుంది* ప్రాజెక్టుల పేరుతో రైతులను బలి చేయొద్దు* రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 25 వేల కోట్లు పెట్టుకొని... అందులో రూ. 70 వేల కోట్లు కాళేశ్వరం, రూ. 60వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి, రూ. 40వేల కోట్లు వాటర్ గ్రీడ్, రూ. 25వేల కోట్లు మిషన్ కాకతీయ అని చెబుతున్నారు. * ప్రాజెక్టుల విషయంలో వైయస్సార్‌సీపీ ఎప్పుడూ చేయూతనిస్తుంది.* దివంగత మహానేత వైయస్సార్ ప్రతి చెయ్యికి పని... ప్రతి చేనుకు నీరు అన్న నినాదంలో ముందుకెళ్లి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారు* ఆ ప్రాజెక్టుల్లోనే ఒకసారి బంతిపూలు... మరొసారి చామంతి పూలు... ఇంకొసారి రోజాపూలు పోసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు* టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో ఒక ప్రాజెక్టునైనా పూర్తి చేశారా..? ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీరందించారు..?* కేసీఆర్ సొంత నిర్ణయాలు పనికి రావు...* కేసీఆర్ గురువు చంద్రబాబు రూ. లక్షా 5వేల ఎకరాలతో రాజధాని అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు* రాజధాని నిర్మాణమంటూ భూముల కోసం దారుణాలు చేస్తున్నారు. * చంద్రబాబు ఒకప్పుడు హైదరాబాద్‌లో గుర్రాలతో ప్రజలను తొక్కించినందుకు ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో కేసీఆర్ ఒకసారి గుర్తుకు తెచ్చుకో* భూముల కోసం కేసీఆర్ సైతం చంద్రబాబు దారిలో నడుస్తున్నారు.* భూముల కోసం అక్రమాలకు పాల్పడితే కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తప్పదు* ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి తీరే ఎదురవుతుంది* తెలంగాణ నిర్మాణం ఎవరూ వద్దనరు.. ముందు రైతుల పొట్ట నింపండి* 123 జీవో నిర్ణయం కేసీఆర్ తీసుకుందే... తెలంగాణ రాష్ట్రంలో ఏ జీవో విడుదలైనా దానికి కారణం కేసీఆరే