1228.5 కిమీ పాదయాత్ర పూర్తిచేసిన షర్మిల

వేములూరుపాడు (గంటూరు జిల్లా), 13 మార్చి 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారంనాటి షెడ్యూల్‌ పూర్తయింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వేములూరుపాడు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె చేరుకోవడంతో నేటి పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసింది. బుధవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 13.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కాగా, నేటి పాదయాత్ర ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల 89 రోజుల్లో 1228.5 కిలోమీటర్లు నడిచారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొండవీడు మీదుగా తాడికొండ నియోజకవర్గంలోని హెచ్.గణే‌శ్‌పేట మీదుగా ఫిరంగిపురం చేరుకున్నారు. ఫిరంగిపురంలో ఆమె అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి ఆమె భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. విరామం అనంతరం వేములూరుపాడు మీదుగా రాత్రి బసకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు.

జనం బాధలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానిని భుజాన మోస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ, చారిత్రక పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆమె ఆయా గ్రామాల్లోని సమస్యలను స్థానికుల నుంచి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా కంటక ప్రభుత్వం తీరు వల్ల అష్ట కష్టాలూ పడుతున్న ప్రజలకు జగనన్న వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని, అందరి సమస్యలూ తీరుస్తారంటూ భరోసానిస్తున్నారు.
Back to Top