ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 1100 కిలోమీట‌ర్లునెల్లూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. 82వ రోజు పాద‌యాత్ర‌లో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలోని క‌లిగిరి వ‌ద్ద 1100 కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జ‌న‌నేత‌కు పార్టీ శ్రేణులు, గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జన ప్రవాహంతో క‌లిగిరి క్రాస్‌ జాతరలా మారింది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని సైదాపురం వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 1000 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటి ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు. అదే జిల్లాలో 1100 కిలోమీట‌ర్ల మైలు రాయిని అధిగ‌మించ‌డంతో పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయం నుంచే వాళ్లంతా జననేత అడుగులో అడుగులేశారు.  జననేతను వేలాది మంది కలిశారు. వీళ్లలో అభాగ్యులు, అన్నార్తులు, విధివంచితులున్నారు. ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిపోయిన వాళ్ళూ వైయ‌స్ జగన్‌కు తమ గోడు చెప్పుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు.. ఆర్థికంగా చితికిపోయిన వాళ్లు, ఉద్యోగులూ.. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల వారూ అభిమాన నేత ముందు బాధలు చెప్పుకున్నారు. అందరి కష్టాలను ఓపికగా వింటూ.. ధైర్యం చెబుతూ మంచి రోజులొస్తాయనే భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.    
Back to Top