వైయస్‌ఆర్‌సీపీలో వంద మంది చేరిక

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ పరిధిలోని ఓజిలి మండలం రాచపాలెం, భువనగిరిపాలెంలో ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల గురించి ఎమ్మెల్యే వివరించారు. అదే విధంగా నాలుగున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న దోపిడీ పాలనను ఎండగట్టారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య సమక్షంలో కాంగ్రెస్‌ నేత రామోదర్‌రాజు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గుంతమడుగు రవీంద్రరాజు పాల్గొన్నారు. 
గూడూరులో వంద మంది చేరిక
సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పి.గూడూరు మండలం ఆర్‌వీ కండ్రిగకు చెందిన 100 మంది వివిధ పార్టీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకే పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. 
Back to Top