జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు ప్రారంభం- అస్ట్రేలియాలో ఘ‌నంగా వైయ‌స్ జ‌గ‌న్ బ‌ర్త్ డే వేడుక‌లు
- ముంద‌స్తు సంబ‌రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
అస్ట్రేలియా:  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుక‌లు వారం ముందుగానే ప్రారంభ‌మ‌య్యాయి. అస్ట్రేలియాలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. భారీ కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ముంద‌స్తు సంబ‌రాల్లో పార్టీ శ్రేణులు మునిగి తేలారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న రాజ‌న్న బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్‌ మ‌రెన్నో జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. వ‌చ్చే పుట్టిన రోజు నాటికి ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని ప్రార్థించారు. ఈ వేడుకల్లో వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్‌ యార్లగడ్డ రమ్య, నాయకులు రాజేష్, కౌశిక్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జ‌గ‌న్‌  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top