చిరు వ్యాపారులకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన..

న్యాయం అడిగితే ఈడ్చుకెళ్లిన పోలీసులు..

పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.

వైయస్‌ఆర్‌సీపీ నేత  చంద్రశేఖర్‌ రెడ్డి ఆగ్రహం...

తూర్పుగోదావరి జిల్లా: కాకినాడలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.కూరగాయల మార్కెట్‌ కోసం నిర్మించిన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు వేరే వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌  కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో చిరువ్యాపారులు నిరసన తెలిపారు.ఆందోళన చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్, కార్యకర్తలు,మహిళలను  పోలీసులు ఈడ్చుకెళ్ళారు.వైయస్‌ఆర్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పోలీసుస్టేషన్‌కు చేరుకుని పోలీసుల చర్యలను తప్పుబట్టారు.

అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారించడం పట్ల మండిపడ్డారు.న్యాయం అడిగితే ఈడ్చుకెళ్ళి కొట్టడం దారుణమని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఆందోళనకు దిగివచ్చిన ఎమ్మెల్యే కొండబాబు..భవనాన్ని మార్కెట్‌కే కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Back to Top