ఆంధ్రరాష్ట్రాన్ని బాబు అంధకారంలోకి నెట్టారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఓ వెలుగు వెలిగిన ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు పాలనలో అంధకారంలోకి వెళ్లిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న సమర శంఖారావం సభలో పాల్గొన్న కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబు, కరువు కవల పిల్లలన్నారు. నెల్లూరు జిల్లాలో పాలన అస్తవ్యస్థంగా తయారైందన్నారు. ప్రజలు నాలుగు సార్లు తిరస్కరించిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రజల మధ్య ఏనాడూ మెలగని వ్యక్తి నారాయణను మరో మంత్రిని చేశారన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని మంత్రిని చేసి నెల్లూరు ఇన్‌చార్జి మంత్రిగా నియమించారన్నారు. వీరిని చూస్తే పాలన ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీకి కంచుకోట అని నిరూపిస్తామన్నారు. పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు ఎంపీ నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలిపించుకుంటామన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు. 

 

Back to Top