వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో తొలి సమావేశం

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో తొలి సమావేశం మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృతంలో 31 మందితో ఇటీవల వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కమిటీని నిర్ణయించారు. కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొని మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. మార్చి 6వ తేదీ మరోసారి మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
 

Back to Top