ప్రమాదంలో వైయస్‌ఆర్‌సీపీ నేత వినోద వర్మ మృతి

తూర్పుగోదావరి: కె.గంగవరం మండలం పాతకోట వద్ద డ్యాంలో కారు బోల్తా పడి ఎదుర్లంకకు చెందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత వినోద వర్మ మృతి చెందారు.యానాం నుంచి కోటిపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఎన్నికల్లో  వైయస్‌ఆర్‌సీపీ తరపున ఆయన ఉత్సాహంగా పనిచేశారని స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వర్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top