అగ్రిగోల్డ్‌ బాధితుల ఉసురు తగలకపోదు

సదావర్తి తరహాలో హాయ్‌ల్యాండ్‌కు ఎసరు

అగ్రి ఆస్తులను కాజేయడమే చంద్రబాబు, చినబాబు లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ తరఫున బాధితులను ఆదుకుని తీరుతాం

వైయస్‌ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

ఆనాడు సదావర్తి భూములను కాజేయాలని ఎలాగైతే ప్రయత్నించారో.. ఇప్పుడు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లకు బాధితుల ఉసురు తగులుతుంది.ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిజమైన లబ్ధిదారులు న్యాయం జరిగేలా చూడాల్సింది పోయి తన బినామీదార్లకు, బంధువులకు దోచి పెట్టాలని చూడటం సిగ్గు చేటని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలంలో కొనడానికి ముందుకొచ్చిన సంస్థతో ముందస్తుగా ఢిల్లీలో మంతనాలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత సదరు కంపెనీ వేలంపై వెనక్కి తగ్గిందని.. ప్రభుత్వం తనకు సహకరించడం లేదని కోర్టుకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  దీనిపై ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే మూడు రోజుల తర్వాత ప్రత్యేక హోదా కోసమే వెళ్లినట్లు కవరింగ్‌ ఇచ్చారని ఆరోపించారు. 

ఆనాడు వైయ‌స్ఆర్  తక్షణం స్పందించారు..

నాడు వైయ‌స్ఆర్ హయాంలో సత్యం కుంభకోణం వెలుగు చూసినప్పుడు తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి  వైయ‌స్ఆర్  కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లపాటు అధికారంలో ఉండి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పనులను పక్కనపెట్టి.. ఎన్నికలకు రెండు నెలల ముందు కడప స్టీల్‌ ప్లాంట్, ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపనలు చేసినంత మాత్రాన జనం నమ్మే పరిస్థితి లేదని హెచ్చరించారు. 

ఎన్‌ఐఏ దర్యాప్తుతో నిజాలు బహిర్గతం

ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద జరిగిన హత్యా ప్రయత్నం వెనుక కుట్ర దాగి ఉందని వైయస్‌ఆర్‌సీపీ మొదట్నుంచీ చెబుతూ వస్తుందని బొత్స పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఉలిక్కి పడిన తర్వాతే తమకు అనుమానాలు బలపడ్డాయని ఆరోపించారు. అయితే డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన నాటి నుంచి గడిచిన రెండు నెలలుగా జరిగిన పరిణామాలు ప్రభుత్వ కుట్రలకు బలం చేకూరుస్తున్నాయని తెలిపారు. హైకోర్టు విభజనను కూడా జగన్‌ కోసమే జరిగిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కోర్టు విభజనకు సంబంధించి తానే అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయాన్ని ఆయన మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయడం శుభపరిణామం అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్లడంపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని భయంతోనే ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని ఆరోపించారు. 

ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలా బాబు నిర్ణయిస్తారా..?

ఎవరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో కూడా చంద్రబాబు నిర్దేశిస్తారా అని బొత్స ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీలు విడిపోలేదని, ఆ రెండు పార్టీలు ఇంకా కలిసే ఉన్నారని చెప్పారు. బయటకి మాత్రం అప్పుడప్పుడూ తిట్టుకుంటూ విడిపోయామని కలరింగ్‌ ఇస్తున్నారని చెప్పారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఏం ఉద్దరించారో చెప్పాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లో చొక్కా పుచ్చుకుని నిలదీస్తున్నారని చెప్పారు. మరో వంద రోజులు ఆగితే చంద్రబాబు పాలనకు తెరపడుతుందని జోస్యం చెప్పారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే 

Back to Top