నా ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేశారు

వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు

పశ్చిమగోదావరి: తన ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేశారంటూ వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఎన్నికల అధికారికి,భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29న భీమవరంలో జరిగిన సినీ అభిమానుల సమావేశంలో తన ప్రసంగాన్ని తప్పుగా చూపించారని తెలిపారు. ప్రసంగం వీడియోను  రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్‌ పోలీసులకు అందజేశారు.

   
Back to Top