తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక, వైయస్ఆర్‌సీపీ ఇప్పటికే ప్రజా పోరాటాలకు దిగిన విషయం తెలిసిందే. ఈనెల 13న వైయస్ఆర్‌సీపీ నేతలు రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో చేయబోయే ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు, పలు అంశాలపై పార్టీ నేతలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.