టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

  వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 
 

విశాఖపట్నం : టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన పలువురికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించారు. ప్రభుత్వం కేవలం ఆర్థిక సహాయం ప్రాతిపదికగా కాకుండా పూర్తిగా ఆరోగ్యం నిలకడగా మారేంతవరకు సహాయం అందిస్తుందని దీనికి ఎంత భారమైనా భరించాలని సీఎం ఆదేశించారని విజయసాయిరెడ్డి చెప్పారు. 
 

Back to Top