వైయస్‌ఆర్‌సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర

వైయస్‌ వివేకానందరెడ్డి ఓటు తొలగించాలని అధికారులకు దరఖాస్తు

వివేకానందరెడ్డికి తెలియకుండానే విన్నపం

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ సీపీ నేతల ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్రలు చేస్తోంది. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి ఓటు తొలగింపునకు ఆయనకు తెలియకుండానే అధికారులకు దరఖాస్తు అందజేశారు. స్వయంగా వివేకానందరెడ్డే దరఖాస్తు పెట్టుకున్నట్లు ఫారం–7 దాఖలు చేశారు. పులివెందుల బాకరాపురంలోని 134వ బూత్‌లో వివేకానందరెడ్డి ఓటు ఉంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఓట్లు తొలగింపే టార్గెట్‌గా టీడీపీ కుట్రలు చేస్తోంది. 
 

Back to Top