నేడు రాయ‌చోటి, పెన‌మ‌లూరులో సామాజిక సాధికార యాత్ర! 

అమ‌రావ‌తి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని వివరిస్తూ వారిని చైతన్య పరిచే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నేడు రాయచోటి, పెన‌మ‌లూరు నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. నాలుగున్నరేళ్ల సీఎం వైయస్ జగన్ పాలనలో జరిగిన సామాజిక విప్లవాన్ని   వైయస్‌ఆర్‌సీపీ నేతలు వివ‌రించ‌నున్నారు.  పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ ద్వారా ప్రజలకు సంక్షేమ పాలనను ప్రజాప్రతినిధులు, నాయకులు వివరించనున్నారు. తాడిగడపలో గల వైయ‌స్ఆర్‌సీపీ  కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం 2.30 గంటల నుంచి మోటర్‌ బైక్‌ ర్యాలీ కంకిపాడు వరకూ సాగనుంది. మోటారు బైక్‌లతో పాటుగా ఆటోలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. బస్సుయాత్ర సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రధాన రహదారి వెంబడి వైయ‌స్ఆర్‌సీపీ పతాకాలను కట్టారు. పార్టీ అధినేత, బస్సుయాత్ర బృందంతో కూడిన ఫ్లెక్సీలను రోడ్డు మార్జిన్‌ల వద్ద భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద రోడ్డుకు ఇరువైపులా సరుకుబాదులను పాతి, పార్టీ జెండాలను కట్టారు.  

Back to Top