ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్‌

వైయ‌స్ఆర్‌సీపీలోకి 80 కుటుంబాలు

వైయ‌స్‌ఆర్‌ జిల్లా: ప్రొద్దుటూరు టౌన్‌ మోదంపల్లె హరిజనవాడకు చెందిన రాజేశ్‌తో పాటు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారితో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. స్థానికంగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.

Back to Top