సోమిరెడ్డికి షాక్‌

 సర్వేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం తోటపల్లి గూడూరు మండలం, పాపిరెడ్డి పాలెం గ్రామం నుంచి మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి సమక్షంలో ప‌లువురు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  సోమిరెడ్డి దగ్గర పార్టీలో చేరిన వారు 24 గంటలు గడవకముందే ఆయ‌న‌కు ఘోర ఓటమి తప్పదని తెలిసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వ‌స్తున్నారు.

 సోమిరెడ్డికి చందాల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ఓట్లు రాబట్టుకోవడంలో లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. సోమిరెడ్డి గ్రామాలలో పర్యటించకుండా ఇంట్లో ఏసీ గదిలో కూర్చుని కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాడ‌ని ఆయ‌న‌ సన్నిహితులే విమ‌ర్శిస్తున్నారు. సోమిరెడ్డికి చివరి అవకాశం కావడంతో వీలైనంత స్థాయిలో దండుకోవడం పైనే దృష్టి సారించాడని, ఎన్నికలలో గెలుపు పై ఆశ వదులుకున్నాడని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అభిప్రాయపడుతున్నారు.

Back to Top