నూత‌న ఎంపీపీకి మాజీ మంత్రి ఆర్కే రోజా అభినంద‌న‌లు

చిత్తూరు జిల్లా: నిండ్ర మండలం నూతన ఎంపీపీ గా ప్రమాణ స్వీకారం చేసిన  దుర్గ మల్లికార్జున నాయుడును వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా అభినందించారు. నిండ్ర మండల ప‌రిష‌త్ కార్యాలయంలో సోమ‌వారం ఎంపీపీగా  దుర్గ మల్లికార్జున నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొని ఎంపీపీకి శుభాకాంక్షలు తెలిపారు. మండ‌లాన్ని అభివృద్ధి దిశ‌గా న‌డిపించాల‌ని సూచించారు.  ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాల‌ని, ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండాల‌ని తెలిపారు.  

Back to Top