న్యూఢిల్లీ: చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు మెదపడు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లేలా కార్మికులను, సంఘాలను తప్పుబడుతున్న చంద్రబాబు, తన తుప్పు బట్టిన ఆలోచనలకి ఉచిత గ్యాస్ లబ్ధిదారుల్లో అరకోటి మందికి ఎగనామం పెట్టడం తెలుసు గానీ..వైజాగ్ ను అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన ఎక్కడ? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.