మాన్సాస్ భూముల విక్ర‌యాల‌పై విచార‌ణ జ‌రిపిస్తాం

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు  మాన్సాస్‌ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ  జరిపిస్తామ‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై బుధ‌వారం విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పాల్గొన్నారు.  దేవాదాయ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరం కూడా ఆక్రమణకు గురి కాకూడదని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు.

డాక్ట‌ర్‌.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతోంది. ఈ పథకం క్షేత్ర స్థాయిలో మరింత పకడ్బందీగా అమలయ్యేలా ప్రతిరోజూ అధికారులు దృష్టి పెట్టాలని, అప్పుడే పేదల మోహంలో చిరునవ్వు చూడగలమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు సూచించార‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top