చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు
 

శ్రీకాకుళం: విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను వ్యతిరేకించిన చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమం చేపట్టి ప్రాంతీయ అసమానతలు పెంచేంది చంద్రబాబేనన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగుల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటే దాన్ని చంద్రబాబు వ్యతిరేకించారన్నారు. అందువల్లే విశాఖ పర్యటనలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైందన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని అడ్డుకుంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు.

తాజా వీడియోలు

Back to Top