ప్రెస్ గ్యాల‌రీలో మంత్రి కొడాలి నాని 

ఆశ్య‌ర్య‌పోయిన మీడియా ప్ర‌తినిధులు
 

 
  అమరావతి: అసెంబ్లీ ప్రెస్‌ గ్యాలరీలోకి ఇద్దరు అతిథులు వచ్చి కూర్చున్నారు. మైనారిటీల సంక్షేమంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ ప్రెస్‌ గ్యాలరీలోకి వచ్చారు. మంత్రి నాని నేరుగా వెళ్లి ముందు వరుసలో ఉన్న సీట్లో కూర్చొని పక్కనున్న విలేకరిని బాగున్నావా? అని అడిగారు.

 
దీంతో అప్పటివరకు సీరియస్‌గా రాసుకుంటున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా మంత్రిని చూసి ఆశ్చర్యపోయారు. ’మీరేంటి ఇక్కడికి వచ్చారు..’ అని మంత్రిని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ ‘మీ గ్యాలరీ నుంచి సభ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను’ అని చెప్పారు. ఈలోపు ఆ చుట్టుపక్కల ఉన్న విలేకరులు అక్కడికి చేరుకుని మంత్రితో కాసేపు ముచ్చటించారు. ఆయన ముందు వరుసలో కాసేపు కూర్చుంటే.. వెనుక వరుసలో వంశీ కూర్చుని సభను తిలకించారు.

తాజా ఫోటోలు

Back to Top