తూర్పు గోదావరి : కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గన్నవరం సభలో మంత్రి మాట్లాడుతూ..మన బడి నాడు నేడు తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశాం. రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది అని అన్నారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలోని స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.